ఒమన్‌లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

- September 13, 2022 , by Maagulf
ఒమన్‌లో హిట్ అండ్ రన్ ప్రమాదంలో ఉపాధ్యాయుడు మృతి

మస్కట్: ఆదివారం జరిగిన హిట్ అండ్ రన్ ప్రమాదంలో అల్-దఖిలియా గవర్నరేట్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన గణిత ఉపాధ్యాయుడు ఇస్సా అల్-హబీబ్ అల్-ఆషి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రకారం.. 2021లో హిట్-అండ్-రన్ ప్రమాదాల కారణంగా 297 మంది మరణించారు. మొత్తం రోడ్డు ప్రమాదాలలో హిట్ అండ్ రన్ కేసులు 19.3 శాతం ఉన్నాయి. మరోవైపు ఉపాధ్యాయుడు ఇస్సా అల్-హబీబ్ అల్-ఆషి మరణం తీవ్ర విషాదకరమని, అతని ఆత్మకు శాంతిని ప్రసాదించాలని స్కూల్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ (10,11,12) అల్-ఖలీల్ బిన్ అబ్దుల్లా తన సంతాపంలో తెలిపారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com