'రాయుడు' ఫస్ట్ లుక్ అదిరింది ..
- April 17, 2016
మాస్ హీరో విశాల్ కథానాయకుడిగా, శ్రీదివ్య హీరోయిన్‌గా ముత్తయ్య దర్శకత్వంలో రూపొందుతున్న మాస్ ఎంటర్‌టైనర్ 'రాయుడు'. విశాల్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని హరి వెంకటేశ్వర పిక్చర్స్ పతాకంపై ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ జి.హరి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. హీరో కార్తీ కాంబినేషన్‌లో 'కొంబన్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని రూపొందించిన ముత్తయ్య ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా, ధనుష్ హీరోగా రూపొందిన 'రఘువరన్ బి.టెక్' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన వేల్‌రాజ్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ అందించడం విశేషం. ఈరోజు 'రాయుడు' ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా మాస్ హీరో విశాల్ మాట్లాడుతూ - ''నా కెరీర్‌లోనే ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుంది. పవర్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న 'రాయుడు' తప్పకుండా మీ అందర్నీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను'' అన్నారు.'రాయుడు' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న హరి వెంకటేశ్వర పిక్చర్స్ అధినేత జి.హరి మాట్లాడుతూ - ''రాయుడు' విశాల్ సినిమాల్లోనే ఒక క్రేజీ ఫిల్మ్ అవుతుంది. మే మొదటి వారంలో ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అవుతుంది. మే మొదటి వారంలోనే ఈ చిత్రం ఆడియోను గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నాం. మే 20న వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రాన్ని రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.మాస్ హీరో విశాల్, శ్రీదివ్య, రాధారవి, సూరి, ఆర్.కె.సురేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వేల్‌రాజ్, సంగీతం: డి.ఇమాన్, ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్., ఫైట్స్: అనల్ అరసు, డాన్స్: బాబా భాస్కర్, సమర్పణ: విశాల్, దర్శకత్వం: ముత్తయ్య.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







