అక్రమంగా కువైట్ లో ఉంటున్న వారి దేశాలకు పంపించే ప్రక్రియ వేగవంతం
- September 13, 2022
కువైట్: కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారిపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. వీసా, సరైన డాక్యుమెంట్లు లేకపోవటం, వీసా గడువు తీరినప్పటికీ దేశంలోనే ఉంటున్న ప్రవాసులను గుర్తించే పనిలో పడింది. ఈ విషయంలో కువైట్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఇలాంటి వాళ్లందరినీ వెంటనే వారి దేశాలకు పంపించాలని నిర్ణయించింది. అక్రమంగా ఉంటున్న వారందరికీ గుర్తించే ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో ప్రవాసుల వీసా, డాక్యుమెంట్లను అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అక్రమంగా ఉంటున్న వారిపై భారీగా ఫైన్లు వేస్తూ వారిని స్వదేశానికి పంపించేందుకు అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కువైట్ లో అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో ప్రక్షాళన చేపట్టింది కువైట్ ప్రభుత్వం. ఇప్పటికే అక్రమంగా ఉంటున్న వారందరూ స్వచ్ఛందంగా స్వదేశాలకు వెళ్లిపోయిందేకు కువైట్ ప్రభుత్వం గడువు ఇచ్చింది. అయినప్పటికీ చాలా మంది దేశం వీడి వెళ్లలేదు. దీంతో మరోసారి గడువు పెంచేది లేదని కువైట్ స్పష్టం చేసింది. అక్రమంగా ఉంటున్న వారిని దేశం నుంచి పంపించాల్సిందేనని గట్టిగా నిర్ణయించింది.
పిల్లల విషయంలో సందిగ్ధత
అక్రమంగా కువైట్ లో ఉంటున్న వారి పిల్లల విషయంలో సందిగ్ధత నెలకొంది. వారి పిల్లల పౌరసత్వం కోసం ఆయా దేశాల్లో వారు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. ఇటు కువైట్ లోనూ వారి చట్టబద్దత పై ఎలాంటి డాక్యుమెంట్లు లేవు. దీంతో వారంతా ఏ దేశ పౌరులన్నది తేలాల్సి ఉంది. చాలా మంది పిల్లల తల్లితండ్రులు ఎవరో కూడా గుర్తించటం కష్టంగా మారింది. దీంతో డీఎన్ఏ టెస్ట్ ల ద్వారా వారిని గుర్తించనున్నారు. ఈ పిల్లల పౌరసత్వం విషయంలో ఆయా దేశాలతో ఎంబసీలతో అధికారులు చర్చలు జరపనున్నారు.
తాజా వార్తలు
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు
- జీఎస్టీ 2.0పై సీఎం చంద్రబాబు స్పందన..
- కొత్త కారు కొనేవాళ్లకు ఇక పండగే అంటున్న భారత ప్రభుత్వం