‘వారసుడు’తో రాజుగారు అప్పుడే లాభాలు కొట్టేశారా.?

- September 13, 2022 , by Maagulf
‘వారసుడు’తో రాజుగారు అప్పుడే లాభాలు కొట్టేశారా.?

దిల్ రాజు ప్రొడక్షన్‌లో ‘వారసుడు’ అనే ప్యాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తమిళ హీరో విజయ్ నటిస్తున్నాడు. విజయ్ నటిస్తున్న తొలి తెలుగు సినిమాగా ఈ సినిమాని అభివర్ణించొచ్చు. 
అయితే, ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే వుంది. కానీ, అప్పుడే సినిమా లాభాల గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అదేంటీ.? సినిమా రిలీజ్ కాకుండానే లాభాల గురించి ఎలా మాట్లాడుతారు.? అంటూ ట్రేడ్ వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయట.
సినిమాని బిజినెస్ చేయడంలో రాజుగారిది అందె వేసిన చేయి. అందుకే, సినిమా పూర్తి కాకుండానే, ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఆల్రెడీ లాభాలు కొట్టేశారట. ఈ సినిమాని ఓవర్సీస్‌లో భారీ మొత్తానికి అమ్మేశారనీ తెలుస్తోంది. అలాగే, కర్ణాటక, కేరళ, తమిళనాడు తదితర రాష్ర్టాల్లోనూ ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగిందట. దాదాపు 120 కోట్ల వరకూ బిజినెస్ జరిగిందనీ అంటున్నారు.
ఇక తమిళనాట విజయ్‌కి వున్న ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజయ్ నటించిన ఏ సినిమా అయినా అక్కడ హిట్ అయ్యి తీరుతుంది. ‘బీస్ట్’ సినిమా తెలుగులో ఫ్లాప్‌గా తేల్చగా, తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.
సో, ఈ లెక్కల్లో ‘వారసుడు’క్ష రిలీజ్ కాకుండానే లాభాలు దక్కించేసుకున్నాడనే గుస గుస గట్టిగా వినిపిస్తోంది. రష్మిక మండన్నా ఈ సినిమాలో విజయ్‌కి జోడీగా నటిస్తోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com