చిరంజీవి, విక్టరీ వెంకటేష్ టైమింగ్ అదిరిపోద్ది: అంతేగా అంతేగా.!
- September 13, 2022
మెగాస్టార్ చిరంజీవి కామెడీ టైమింగ్ గురించి తెలిసిందే. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యారు. ఇక ఆ తర్వాత కామెడీ టైమింగ్‌లో కేక పుట్టించగల సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్. ఫ్యామిలీ ఆడియన్స్ వెంకటేష్ సినిమాలకు క్యూ కట్టేందుకు కారణం ఆయన కామెడీ టైమింగే.
రీసెంట్‌గా ‘ఎఫ్ 3’ విజయానికీ ఆయన పాత్రే కీలకమైన కారణం. కాగా, మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరూ ఒకే స్ర్కీన్‌పై కలిసి కనిపించబోతున్నారట. ఇంతకీ ఏం సినిమా కోసం అనుకుంటున్నారా.? మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా మూవీ ‘వాల్తేర్ వీర్రాజు’ కోసం.
ఇదో మాస్ మసాలా ఎంటర్‌టైనర్ మూవీ అని తెలిసిందే. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి పక్కా మాస్ రోల్‌లో నటిస్తున్నారు. అన్నిరకాల కమర్షియల్ అంశాలతో రూపొందుతోన్న ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ కోసం విక్టరీ వెంకటేష్‌ని సంప్రదించారట. చిరుతో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ వచ్చినందుకు వెంకీ కూడా సై అన్నారట.
దాంతో, ఈ కాంబినేషన్ సెట్ అయిపోయిందనీ అంటున్నారు. ఈ ఇద్దరి మధ్యా వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించడమే కాదు, సినిమాకి మెయిన్ అస్సెట్ అవుతాయనీ అంటున్నారు. చాలా తక్కువ నిడివి మాత్రమే వుండే వెంకీ రోల్ చాలా ప్రత్యేకంగా వుండబోతోందట. చూడాలి మరి, ఈ ప్రచారం నిజమో కాదో.!
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు