సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్

- September 14, 2022 , by Maagulf
సెప్టెంబరు 14న ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌజ్

కువైట్: 2022 సెప్టెంబరు 14న భారత రాయబార కార్యాలయంలో ఉదయం 11:00 నుండి 12:00 గంటల వరకు ఓపెన్ హౌజ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం ఉదయం 10:00 గంటల నుండి రిజిస్ట్రేషన్‌లను స్వీకరించనున్నారు. కువైట్‌లోని కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న భారతీయ పౌరులందరూ ఇందులో పాల్గొనవచ్చని ఎంబసీ తెలిపింది.  పాస్‌పోర్ట్, పాస్‌పోర్ట్ నంబర్, సివిల్ ఐడి నంబర్, కువైట్‌లోని ఫోన్ నంబర్, చిరునామా వంటి పూర్తి వివరాలతో [email protected]కు ఇమెయిల్ ద్వారా తమ సమస్యలను ముందుగానే పంపవచ్చని ఇండియన్ ఎంబసీ పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com