త్రివిక్రమ్-మహేష్ ప్రాజెక్ట్‌పై కొత్త గాసిప్ నిజమేనా.?

- September 14, 2022 , by Maagulf
త్రివిక్రమ్-మహేష్ ప్రాజెక్ట్‌పై కొత్త గాసిప్ నిజమేనా.?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ప్రాజెక్ట్ గురించి తాజాగా ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఓ యంగ్ హీరో నటించబోతున్నాడనేది ఆ గాసిప్ సారాంశం. 
పాపులర్ యంగ్ హీరో అనీ తెలుస్తోంది. మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ టైమ్‌లో కూడా ఇలాగే పొగ రాజింది. అయితే, ఒకానొక టైమ్‌లో అల్లరి నరేష్ ఈ గాసిప్‌ని ఖండించాడు కూడా.
కట్ చేస్తే, ఆ గాసిప్ నిజమైంది. ఇప్పుడు ఇంకోసారి, మహేష్ సినిమాలో ఆ యంగ్ హీరో అట.. అనే ప్రచారం జరుగుతోంది. అయితే, పేరు మాత్రం రివీల్ కాలేదు. బాగా పాపులర్ యంగ్ హీరో అంటే, ఖచ్చితంగా ఇదో మల్టీ స్టారర్ అయ్యే అవకాశం వుందని కొందరు అంచనా వేస్తున్నారు. 
ఒకవేళ అదే జరిగితే, ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలున్నాయ్. ఇప్పటికే త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయ్. ఇక, తాజా ప్రచారంతో ఆ అంచనాలు రెట్టింపు అవ్వనున్నాయ్. ఇటీవలే సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా ప్రస్తుతం ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో బిజీగా వుంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com