నకిలీ పత్రాలతో బ్యాంకుకే టోపీ వేసిన మోసగాడు

- April 17, 2016 , by Maagulf
నకిలీ పత్రాలతో బ్యాంకుకే టోపీ వేసిన మోసగాడు

ఒక బ్యాంకు ఉద్యోగి నకిలీ పత్రాలు ఉపయోగించి విజయవంతంగా బురిడీ కొట్టించాడు. తన సైనిక సేవ పూర్తి చేసినందుకు గాను  డి హెచ్ 157,000  డబ్బును  డ్రా చేసి  తీసుకొన్నాడు. ఇందుకు మోసకరమైన  అధికారిక పత్రాలను ఆ వ్యక్తి ఉపయోగించినట్లు ఆరోపించబడింది.30 ఏళ్ల ఎమిరేట్ ఉద్యోగి  కె . హెఛ్ సైన్యంలో విధులని  పూర్తి చేసినట్లుగా... సైనిక సేవ చేసినట్లు ఉన్న  పత్రాలపై సమయం,తేదీలను దిద్ది తనకి అనుకూలంగా మార్చుకొన్నాడు. సాయుధ దళాల తరపున జారీ చేయబడిన ఈ పత్రాలు నకిలీవని నిపుణుల పరిశీలనలో తేలడంతో ఈ మోసం వెలుగులోనికి వచ్చింది. తాను 2015 లో సాయుధ దళాల్లో పనిచేసినట్లు బ్యాంకుకి విన్నవించి తనకు రావాల్సిన నగదుని వెంటనే మంజూరు చేయాలని పేర్కొన్నడు తర్వాత  157,000 డి హెచ్ లను  బ్యాంకు నుండి అపహరించాడు.నకిలీ పత్రాలు ఉపయోగించి  కె . హెఛ్  ఫోర్జరీ  ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు న్యాయవాదులు  ఆరోపణలు చేశారు. తొలుత అనుమానితుడు ఏమాత్రం ఈ నేరాన్ని అంగీకరించలేదు. మొదటి న్యాయ దుబాయ్ కోర్టు గత ఆదివారం అతని ఆరోపణలు తిప్పికొట్టింది.ఛార్జిషీట్ ప్రకారం, న్యాయవాదులు అనుమానితుడు అతను విజయవంతంగా తన సైనిక సేవ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు ఇది సాయుధ దళాల తరపున నాకు ఇచ్చిన ఒక కాగితం అని పేర్కొన్నారు. పని చేస్తున్నబ్యాంకును కూడా మోసం చేసినందుకు... చట్టపరమైన ఏ అర్హత లేకుండా డబ్బు తీసుకొన్నట్లు అతనిపై  ఆరోపణలు చేశారు.

నిందితుడు ఎవరి వద్ద నుంచో  సైన్యంలో పనిచేసినట్లుగా సాయుధ దళాల సర్టిఫికేట్ ని సేకరించి, దానిని    తన మొబైల్ ఫోన్ లో  ఫోటో తీసుకొన్నాడు. తర్వాత తన లాప్ టాప్ లో సర్టిఫికేట్ ఫోటోని వివరాలు హొదాను  కాపీ మరియు పేస్ట్ ద్వారా మార్చి ప్రింటు తీసుకొని తాను పని చేస్తున్న బ్యాంకులో నకిలీ పత్రాలు ఉపయోగింఛి  మోసపూరితంగా డబ్బు అపహరించినట్లు న్యాయవాదుల ఎదుట నిందితుడు తన  నేరాన్ని అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com