కమ్యూనిటీ పోలీసును సత్కరించిన అంతర్గత మంత్రి

- September 16, 2022 , by Maagulf
కమ్యూనిటీ పోలీసును సత్కరించిన అంతర్గత మంత్రి

మనామా: ఉత్తర గవర్నరేట్ పోలీసు డైరెక్టరేట్‌కు చెందిన కమ్యూనిటీ పోలీసు సిబ్బందిని పబ్లిక్ సెక్యూరిటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ తారిఖ్ అల్ హసన్ సమక్షంలో అంతర్గత మంత్రి జనరల్ షేక్ రషీద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా సత్కరించారు. ప్రజల భద్రతను పరిరక్షించేందుకు కమ్యూనిటీ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, విధి నిర్వహణలో మానవతావాదాన్ని చూపాలని పోలీసులకు ఈ సందర్భంగా అంతర్గత మంత్రి అల్ ఖలీఫా సూచించారు. మంత్రితో సత్కారం పొందిన నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టరేట్‌కి చెందిన కమ్యూనిటీ పోలీసు ఫదేల్ అబ్బాస్ అలావి అల్ ఖబర్జ్..  హమద్ టౌన్‌లోని ఒక ప్రాథమిక పాఠశాల విద్యార్థిని పాఠశాలకు వెళ్లే క్రమంలో జరిగిన ప్రమాదం నుంచి కాపాడి క్షేమంగా పాఠశాలకు చేర్చాడు. ఈ సమావేశానికి హ్యూమన్ రిసోర్సెస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ, నార్తర్న్ గవర్నరేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ హాజరయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com