పోలీస్ కస్టడీలో గుండెజబ్బు. కోమాలోకి వెళ్లిన ఇరాన్ మహిళ

- September 16, 2022 , by Maagulf
పోలీస్ కస్టడీలో గుండెజబ్బు. కోమాలోకి వెళ్లిన ఇరాన్ మహిళ

టెహ్రన్: పోలీస్ కస్టడీలో ఉన్న 22 ఏళ్ల ఇరాన్ కు చెందిన మహిళ కు గుండెజబ్బు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో వెంటనే హాస్పిటల్ లో చేర్పించారు. ఐతే అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించి ఆమె కోమాలోకి వెళ్లింది. మహ్ షా ఆమిని అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి టెహ్రన్ విజిట్ కు వచ్చారు. ఐతే ఇరాన్ లో పబ్లిక్ ప్లేస్ లో మహిళలు హిజాబ్ కచ్చితంగా ధరించాలనే నిబంధన ఉంది. ఈ నిబంధనను ఆ మహిళ ఉల్లంఘించటంతో మోరల్ పోలీసులు ఆమె ను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రెండు గంటల్లోనే ఆమెను హాస్పిటల్ లో చేర్పించారు. దీంతో పోలీసులే ఆమె ఆరోగ్యానికి హాని తలపెట్టారంటూ విమర్శలు వచ్చాయి. మహ్ షా సోదరుడు ఈ విషయంలో కచ్చితంగా న్యాయ పోరాటం చేస్తానని తేల్చిచెప్పారు. తన సోదరిని అరెస్ట్ చేసిన వెంటనే తాను పోలీస్ స్టేషన్ ను వెళ్లానని ఆయన మీడియాకు చెప్పారు. తనను బయట వేచి ఉండమని చెప్పిన పోలీసులు రెండు గంటల్లోనే అంబులెన్స్ పిలిపించారన్నారు. ఐతే పోలీసులు మాత్రం హిజాబ్ నిబంధన గురించి ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మాత్రమే అరెస్ట్ చేశామని చెప్పారు. ఇంతలోనే ఆమె కు గుండె జబ్బు, బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారన్నారు. ఐతే ఈ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇరాన్ -బ్రిటిష్ సంతతికి చెందిన నజానిన్ బొనియాది, ఇరాన్ కు ప్రజల భావ స్వేచ్ఛ కోసం పోరాటం చేస్తున్న హోసెన్ రోణాగ్హ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఎంతకాలం ఇలాంటి క్రూరమైన ప్రవర్తనకు పాల్పడుతారంటూ విమర్శించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com