ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్
- September 16, 2022
రియాద్: ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ అయిన హరమైన్ ఎక్స్ ప్రెస్ ను నడుపనున్నారు. ప్రపంచం నలుమాలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనా లను సందర్శిస్తారు. ఐతే మక్కా, మదీనా లను సందర్శించే యాత్రికులకు టైమ్ సేవ్ అయ్యే విధంగా హై స్పీడ్ ట్రైన్ ను నడుపనున్నారు. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లో వెళ్లే వారు రెండున్నర గంటల్లో మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి మక్కా కు చేరుకుంటారు. టికెట్ ధర 40 రియా ల నుంచి 150 రియాల వరకు ఉంటుంది. దాదాపు 4 వందల మంది ఒకేసారి ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రకు వచ్చే సందర్శకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!







