ప్రధాని మోడీ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్
- September 17, 2022
హైదరాబాద్: నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ 72వ పుట్టినరోజు. ఈ సందర్భంగా సామాన్యుల దగ్గర నుంచి ప్రపంచ నేతల వరకు ఆయనకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మోడీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎం కేసీఆర్ ప్రార్థించారు. దేశానికి ఇంకా చాలా ఏండ్లు సేవ చేసేలా ఆరోగ్యంగా ఉండాలని కేసీఆర్ ప్రార్థించారు.అలాగే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సైతం మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్.. దేవుని ఆశీస్సులతో మంచి ఆరోగ్యం, దీర్ఘాయిష్షు ఉండాలని అభిలాషించిచారు.
అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రధాని మోడీకి విషెస్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీకి హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని.. దేశ ప్రజలకు మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోడీని గతంలో కలిసిన ఫోటోను కూడా చంద్రబాబు ట్వీట్ చేశారు.
అలాగే భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. సాటిలేని కఠోర శ్రమ, అంకితభావం, సృజనాత్మకతతో మీరు చేపడుతున్న దేశ నిర్మాణ సంగ్రామం ‘మీ నాయకత్వంలో కొనసాగాలని కోరుకుంటున్నాను’ అన్నారు. భగవంతుడు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువును ప్రసాదించాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







