సదరన్ ట్రావెల్స్ కొత్త లోగోను ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

- September 17, 2022 , by Maagulf
సదరన్ ట్రావెల్స్ కొత్త లోగోను ఆవిష్కరించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ: సదరన్ ట్రావెల్స్ తన 5 దశాబ్దాల ప్రయాణాన్ని జరుపుకుంటున్నది.ఈ సందర్భంగా సదరన్ ట్రావెల్స్ కొత్త బ్రాండ్ లోగోను కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి న్యూఢిల్లీలోని లలిత్‌లో సెప్టెంబర్ 14న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో పర్యాటక రంగానికి సదరన్ ట్రావెల్స్ అందిస్తున్న సహకారాన్ని కొనియాడారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని అందరికి చేరువ చేస్తుందన్నారు. తన 50 సంవత్సరాల ప్రయాణంలో అద్భుత సేవలందించి పలు జాతీయ స్థాయి అవార్డులను పొందిందని అభినందించారు.WTM, ITB బెర్లిన్, ICCA, ATM, TANA వంటి పలు అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈవెంట్‌లలో దేశానికి ప్రాతినిధ్యం వహించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రశంసలు కురిపించారు.  

2023 నాటికి 50 నగరాల్లో సేవలు: సదరన్ ట్రావెల్స్ ఎండీ ఎ.కృష్ణ మోహన్

సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎ కృష్ణ మోహన్ మాట్లాడుతూ.. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్‌లో 18-గదులు + 36 డార్మిటరీ పడకల సౌకర్యాన్ని అందించిన మొదటి సంస్థ సదరన్ ట్రావెల్స్ అని తెలిపారు. భారతదేశ పర్యాటక పరిశ్రమలో సదరన్ ట్రావెల్స్ ప్రముఖ బ్రాండ్ గా ఎదిగిందన్నారు. సీనియర్ సిటిజన్‌లు, ఎన్‌ఆర్‌ఐలు చాలా దగ్గరి నుండి భారత్ ను సందర్శించేందుకు సాయపడుతుందన్నారు.  2024 నాటికి దక్షిణ భారతదేశం నుండి ఆగ్నేయాసియా వరకు, క్రమంగా ఇతర ఖండాలలోకి సంస్థ కార్యాకలాపాలను విస్తరించేందుకు ప్రతిష్టాత్మక ప్రణాళికలు, వ్యూహాలతో ముందుకు పోతుందన్నారు. ప్రస్తుతం భారతదేశంలో 11 కార్యాలయాల ద్వారా ఏటా 1.5 లక్షల మంది పర్యాటకులకు సేవలు అందిస్తుందని తెలిపారు. 2023 నాటికి భారతదేశంలోని 50కి పైగా నగరాల్లో సర్వీస్ ప్రొవైడర్‌గా సదరన్ ట్రావెల్స్ ఎదుగుతుందని కృష్ణ మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com