నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్

- September 17, 2022 , by Maagulf
నకిలీ నోట్ల తయారీ ముఠా అరెస్ట్

కువైట్: కువైట్ లో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానికంగా నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాకు సంబంధించి పక్కా సమాచారం అందటంతో క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్‌లోని ముబారక్ అల్-కబీర్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ వారి ఇళ్లపై దాడి చేసింది. నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులకు అప్పగించింది. వారి వద్ద నుంచి నకిలీ నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న వస్తువులను, నకిలీ కరెన్సీ ని స్వాధీనం చేసుకుంది. నకిలీ కరెన్సీ ఉపయోగించి ఈ ముఠా చాలా మోసాలకు పాల్పడిందని పోలీసులు గుర్తించారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com