బకాయిలు కట్టలేదని సనాబిస్ సోసైటీకి గ్యాస్ సప్లయ్ నిలిపివేసిన బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ
- September 18, 2022
బహ్రెయిన్: గ్యాస్ సరఫరా కు సంబంధించిన బకాయిలను చెల్లించలేని కారణంగా సనాబిస్ కోఆపరేటివ్ కన్స్యూమర్ సొసైటీ నడుపుతున్న గ్యాస్ స్టేషన్‌కు ఇంధన సరఫరా నిలిచిపోయింది. ఈ సోసైటీకి గ్యాస్ సరఫరాను బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ నిలిపివేసింది. కాంట్రాక్ట్ ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు సనాబిస్ సోసైటీకి గ్యాస్ నిలిపివేశామని ప్రకటించింది. ఒప్పందంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూనే మళ్లీ గ్యాస్ సరఫరాను పునరుద్ధరిస్తామని బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ స్పష్టం చేసింది. అటు శనివారమే గ్యాస్ స్టేషన్లను మూసి వేస్తున్నట్లు సనాబిస్ సోసైటీ ఇన్ స్టా గ్రామ్ ద్వారా ప్రకటన విడుదల చేసింది. బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ గ్యాస్ సరఫరా నిలిపివేసిన కారణంగానే గ్యాస్ స్టేషన్లను మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో బహ్రెయిన్ పెట్రోలియం కంపెనీ గ్యాస్ సరఫరా నిలిపివేసేందుకు కారణాన్ని ఇన్ స్టా గ్రామ్ లో వివరించింది. బకాయిలు చెల్లించిన తర్వాతే మళ్లీ గ్యాస్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఇక శనివారం ఇంధనం కోసం బంక్ లు వచ్చిన కస్టమర్లు బంక్ లు మూసివేయటంతో ఇబ్బంది పడ్డారు.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







