అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ అందించటమే లక్ష్యంగా ఖతార్ కృషి చేస్తోంది-ఎడ్యుకేషన్ మినిస్టర్

- September 18, 2022 , by Maagulf
అందరికీ ఎడ్యుకేషన్, హెల్త్ అందించటమే లక్ష్యంగా ఖతార్ కృషి చేస్తోంది-ఎడ్యుకేషన్ మినిస్టర్

ప్రపంచంలోని ప్రతి వ్యక్తి సరైన విద్య, వైద్యం అందాలన్నదే ఖతార్ లక్ష్యమని ఆ దేశ ఉన్నత విద్యాశాఖ మంత్రి బుతైనా బింట్ అలీ అల్ జబ్ర్ అల్ నుయిమి తెలిపారు. ఇందుకోసం తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా హెల్త్, ఎడ్యుకేషన్ తో పాటు పేదలకు ఆర్థికంగా సాయంగా ఉండే పెద్ద ప్రాజెక్ట్ లలో తమ దేశం పెట్టుబడులు పెడుతోందని చెప్పారు. శనివారం న్యూయార్క్‌లోని UN ప్రధాన కార్యాలయంలో జరిగిన "ట్రాన్స్‌ఫార్మింగ్ ఎడ్యుకేషన్" సమ్మిట్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు. విద్య, వైద్యం, పేదలకు ఆర్థిక సాయం కోసం ఖతార్ ఫండ్ ద్వారా దాదాపు 64 దేశాల్లో ఒక బిలియన్ డాలర్లు ఖర్చు చేశామని చెప్పారు. దీని ద్వారా 60 దేశాల్లోని కోటి మంది బడి మానేసిన విద్యార్థులకు మేలు జరిగిందన్నారు. అదే విధంగా కరోనా సమయంలో ఆర్థికంగా ఇబ్బంది పడిన చాలా మంది తల్లితండ్రులకు సాయం అందించేందుకు బ్యాంక్ స్థాపించామన్నారు. దీని 17 దేశాల్లో విద్యార్థులు చదువు మానేయకుండా ఉండేందుకు తమవంతు కృషి చేశాని చెప్పారు. ఎడ్యుకేషన్ అబౌ ఆల్ ఫౌండేషన్, హర్ హైనెస్ షేఖా మోజా బింట్ నాసర్ ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిచాలని కోరుకున్నారని గుర్తు చేశారు. ఆ ఆలోచనలకు అనుగుణంగా ఖతార్ ప్రభుత్వం తమ వంతు ప్రయాతం చేస్తుందన్నారు. విద్యా ద్వారా ప్రతి వ్యక్తి, సమాజంలోనూ మార్పు సాధ్యమవుతుందన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com