బహ్రెయిన్ లో అక్రమంగా ఉంటున్న ప్రవాస కార్మికుల అరెస్ట్
- September 19, 2022
బహ్రెయిన్ : బహ్రెయిన్ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమంగా ఉంటున్న ప్రవాసులపై నేషనాలిటీ, పాస్ పోర్ట్ అండ్ రెసిడెన్సీ అఫైర్స్ (NPRA) డిపార్ట్ మెంట్ ఫోకస్ పెట్టింది. ఇలాంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తనిఖీలు స్టార్ట్ చేసింది. మనామా సిటీ లో క్యాపిటల్ పోలీసుల సహకారంతో (NPRA) అధికారులు తనిఖీలు చేపట్టారు. బహ్రెయిన్ చట్టాలను ఉల్లంఘించి ఉంటున్న ప్రవాసులను గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. అదే విధంగా అక్రమంగా నివాసం ఉంటున్న ప్రవాసులకు బహ్రెయిన్ చట్టాలపై అవగాహన కల్పించేందుకు అన్ని గవర్నరేట్ల పరిధిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. అక్రమంగా నివాసం ఉంటున్న వారి సమాచారం అందించాలని బహ్రెయిన్ పౌరులకు సూచించారు. తమ చుట్టు పక్కల ఎవరైనా ప్రవాసులు అక్రమంగా నివాసిస్తున్నట్లు అనుమానం కలిగితే వెంటనే 170770777 నంబర్ కు కాల్ లేదా info@npra. gov. bh. కు మెయిల్ కు గానీ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!