రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని కార్మికులపై పరారీ కేసులు

- September 19, 2022 , by Maagulf
రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని కార్మికులపై పరారీ కేసులు

కువైట్: వర్క్ పర్మిట్‌లతో దేశంలోకి వచ్చి రెసిడెన్సీ విధానాలను పూర్తి చేయని ప్రవాస కార్మికులపై పరారీ కేసులను నమోదు చేయడానికి "ఆశల్" పోర్టల్‌లో కొత్త ఫీచర్ ను ప్రారంభించినట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్‌పవర్ (PAM) తెలిపింది. రెసిడెన్సీ విధానాలను పూర్తిచేయని వారిని గుర్తించి వారి సమస్యలను పరిష్కరించడంతోపాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని పట్టుకోవడం లక్ష్యంగా ఈ చర్య తీసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ పేర్కొంది. ఇప్పటివరకు నమోదైన దాదాపు 1,000 పరారీ కేసులను తనిఖీ విభాగం అధ్యయనం చేస్తోందని పీఏఎం తెలిపింది. సాధారణంగా తనపై నమోదైన ఫిర్యాదుపై రెండు నెలలలోపు అభ్యంతరం చెప్పే హక్కును కార్మికుడికి చట్టం ఇస్తుంది. రెండు నెలల గడువు ముగిసిన తర్వాత సదరు కార్మికుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఫైల్ రెసిడెన్సీ వ్యవహారాల దర్యాప్తు విభాగానికి బదిలీ అవుతుంది. అక్కడ రెసిడెన్సీ విధానాలు పాటించని కార్మికుడిని దేశం నుంచి బహిష్కరణతో సహా ఇతర చర్యలను అంతర్గత మంత్రిత్వ శాఖ తీసుకునే అవకాశం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com