‘అల్లూరి’ కోసం అల్లు అర్జున్: కాస్త ‘అతి’ చేశాడంటూ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.!
- September 19, 2022
యంగ్ హీరో శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో ‘అల్లూరి’ అను సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. లెజెండ్ అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసి, ఆడియన్స్ అటెన్షన్ గెయిన్ చేశాడు శ్రీ విష్ణు.
ఫస్ట్ రెస్పాన్స్‌తోనే పాజిటివిటీ దక్కించుకున్న శ్రీ విష్ణు, ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాడు. పోలీసాఫీసర్ పాత్రలో పవర్ ఫుల్ ఆంబియన్స్ ఇస్తున్న ఈ సినిమా, శ్రీ విష్ణు కెరీర్‌లో మరో మంచి సినిమా అవుతుందనడం అతిశయోక్తి కాదేమో అనిపించేలా ఆడియన్స్‌లో అభిప్రాయాలు క్రియేట్ చేశాడు.
త్వరలో ఈ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా, సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ని ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కి అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్‌గా విచ్చేశాడు. శ్రీ విష్ణు తనకు మంచి స్నేహితుడు అనీ, ఆయన సినిమాలను తాను గమనిస్తూ వుంటాననీ, ఈ సినిమా ఆయనకు మంచి విజయం అందించాలని ఈ సందర్భంగా బన్నీ కోరుకున్నాడు.
బాగానే వుంది. కానీ, ఈ సినిమాకి తాను ప్రమోషన్ చేసుకోలేకపోతున్నాననీ, అందుకే మీరు మా సినిమా ఫంక్షన్‌కి వస్తే, యూజ్ అవుతుందనీ శ్రీ విష్ణు, బన్నీని అడగడంతో, ‘పుష్ప 2’తో బిజీగా వున్నా, ఈ ఫంక్షన్‌కి వచ్చానని బన్నీ చెప్పడం.. కొందరికి అస్సలు నచ్చడం లేదు.
ఈ మాటలు బన్నీ కాకుండా, శ్రీ విష్ణు కానీ, సినిమా డైరెక్టర్ కానీ చెప్పి వుండి వుంటే, బాగుండేదనీ, తన గొప్పల డప్పులు తానే చెప్పుకుని బన్నీ దొరికేశాడంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం