‘బబ్లీ బౌన్సర్’ : మిల్కీ బ్యూటీ యాక్షన్ అవతార్.!
- September 19, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మంచి నటి. మంచి డాన్సర్. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటూ, బాలీవుడ్‌లోనూ సత్తా చాటుతోంది. రీసెంట్గా ‘ఎఫ్ 3’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన తమన్నా, ఇప్పుడు మరోసారి స్టన్నింగ్ స్టఫ్‌తో ప్రేక్షకుల్ని పలకరించబోతోంది.
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘బబ్లీ బౌన్సర్’. టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమాలో లేడీ బౌన్సర్‌గా నటించాబోతోంది తమన్నా. తమన్నా ఇంతవరకూ గ్లామర్ హీరోయిన్‌గానే అందరికీ తెలుసు. కానీ, ఈ సినిమాతో తమన్నాలోని నెక్స్ట్ లెవల్ యాంగిల్‌ని చూడబోతున్నారు ప్రేక్షకులు.
సెప్టెంబర్ 23న ఈ సినిమాని ఓటీటీ వేదికగా డిస్నీ హాట్ స్టార్‌లో రిలీజ్ చేస్తున్నారు. హిందీలో రూపొందిన ఈ సినిమా తెలుగులోనూ అందుబాటులో వుండనుంది. ప్రచార చిత్రాలు ఆసక్తిగా కనిపిస్తున్నాయ్.
గతంలో కీర్తి సురేష్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ ఫ్లేవర్ ఈ సినిమాలో కనిపిస్తోంది. తమన్నాలుక్స్ ఆ ఫ్లేవర్‌లో కనిపిస్తున్నప్పటికీ, ఈ సినిమా కథ, కథనాలు ఇంట్రెస్టింగ్గా వున్నాయ్. తమన్నా యాక్షన్ ఎపిసోడ్స్, చబ్బీ లుక్స్, డిఫరెంట్ ఆటిట్యూడ్.. అన్ని రకాల వర్గాలను ఆకట్టుకునేలా వుంది.
చూడాలి మరి, తమన్నాకి ఈ ఓటీటీ కంటెంట్ మంచి పేరు తీసుకొస్తుందో లేదో.! మరోవైపు తమన్నా తెలుగులో మెగాస్టార్ చిరంజీవితో ‘భోళా శంకర్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం