విష్ణు ని 'కన్నప్ప' గా చూపించబోతున్న భరణి
- June 15, 2015
ఇప్పటి వరకు రొమాంటిక్, యాక్షన్ చిత్రాలతో అలరించిన మంచు విష్ణు త్వరలో ఓ భక్తీ చిత్ర కథ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై భారతదేశంలోని అన్నీ భాషల్లో 'కన్నప్ప కథ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమశివుని మహాభక్తుడిగా పేరు పొందిన కన్నప్ప గురించి తెలియని తెలుగువాడుండడు. ఆయన భక్తికి తార్కాణమే శ్రీ కాళహస్తీశ్వరాలయం. శివుని పరమవీర భక్తునిగా పేరు పొందిన కన్నప్ప పాత్రలో యంగ్ అండ్ డైనమిక్ హీరో మంచు విష్ణు నటించనున్నారు. ఈ చిత్రానికి తనికెళ్ల భరణి దర్శకత్వం వహిస్తుండటం విశేషం. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థ, హాలీవుడ్ స్టూడియో భాగస్వామ్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించనున్నామని డా.మోహన్ బాబు తెలియజేశారు.
తాజా వార్తలు
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..
- గ్రీన్ హైడ్రోజన్‌తో భారత్ శక్తి విప్లవం
- కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ







