షువైక్ పోర్ట్ లో భారీగా విదేశీ మద్యం సీజ్ చేసిన కస్టమ్స్ అధికారులు
- September 20, 2022
కువైట్ : అక్రమంగా విదేశీ మద్యాన్ని దేశంలోకి తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. షువైక్ పోర్ట్ లో తనిఖీ చేసి 18, 000 విదేశీ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు పెద్ద కంటైనర్లలో ఐరన్ రాడ్స్ లోడ్ మధ్యలో ఈ బాటిల్స్ ను ఉంచి స్మగ్లింగ్ చేస్తున్నారు. ఐతే పక్కా సమాచారం ఉండటంతో కస్టమ్స్ ఆఫీసర్స్ వీటి పట్టుకున్నారు. ఐరన్ రాడ్స్ ను తొలగించి మద్యం బాటిళ్లను గుర్తించటానికి అధికారులు చాలా కష్టపడాల్సి వచ్చింది. అటు భారీ ఎత్తున అక్రమంగా దేశంలోకి తరలిస్తున్న విదేశీ మద్యాన్ని పట్టుకున్న కస్టమ్స్ సిబ్బందిని డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ తలాల్ అల్ ఖలీద్, వాణిజ్య శాఖ మంత్రి పహద్ అల్ షరియాన్ ప్రశంసించారు.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్‌లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్‌లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







