ట్రెండింగ్ టాక్: ‘ఆర్ఆర్ఆర్’కి ఆ గౌరవం దక్కాల్సిందే.!

- September 19, 2022 , by Maagulf
ట్రెండింగ్ టాక్: ‘ఆర్ఆర్ఆర్’కి ఆ గౌరవం దక్కాల్సిందే.!

తెలుగు సినిమా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ‘ఆర్ఆర్ఆర్’. జక్కన్న రాజమౌళి ప్రయోగాల్లో విజయం సాధించిన మరో శకటం ఈ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా. ప్యాన్ ఇండియా వైజ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న సినిమాగా ‘ఆర్ఆర్ఆర్’ కీర్తి గడించింది.
ఇటువంటి గొప్ప సినిమాకి ‘ఆస్కార్’ అవార్డు దక్కాల్సిందే అంటూ తాజాగా సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్ ఫర్ ఆస్కార్స్’ అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ నెట్టింట్లో ట్రెండింగ్‌లోకి వచ్చింది. 
ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీయార్‌లను ప్రపంచ వ్యాప్తగా ఓన్ చేసుకున్నారు అన్ని వర్గాల ఆడియన్స్. సో, ఉత్తమ హీరోలుగా ఆస్కార్ అవార్డ్ దక్కాల్సిందే ఈ ఇద్దరికీ అంటూ ఇరు హీరోల అభిమానులూ డిమాండ్ చేస్తున్నారు.
అంతేకాదు, డైరెక్టర్ రాజమౌళితో పాటూ, సినిమాటోగ్రపీ, విజువల్ ఎఫెక్ట్స్, యాక్షన్ ఎపిసోడ్స్.. ఇలా అన్ని విభాగాల్లోనూ ఈ సినిమాకి ఆస్కార్ అవార్డులు దక్కించుకోగల అర్హత వుంది.. అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అవును నిజమే, ఈ సినిమాకి ఖచ్చితంగా ఆ అర్హత వుంది. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి సినిమాలు రూపొందుతాయ్. 
అలాంటప్పుడు అరుదైన గౌరవాలు కూడా ఇలాంటి సినిమాలకు దక్కితేనే, ఆయా సినిమాలకు ప్రోత్సాహకంగా వుంటుంది అనేది సినీ మేథావుల అభిప్రాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com