లులూ హైపర్ మార్కెట్ లో 'ఇండియా ఉత్సవ్' సెక్షన్ ను ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్

- September 20, 2022 , by Maagulf
లులూ హైపర్ మార్కెట్ లో \'ఇండియా ఉత్సవ్\' సెక్షన్ ను ప్రారంభించిన మంత్రి పీయూష్ గోయల్

రియాద్: భారత్ కు చెందిన లులూ హైపర్ మార్కెట్ చైన్ సంస్థ అరబ్ దేశాల్లో పెద్ద ఎత్తున సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. అరబ్ దేశాల్లో లులూ సూపర్ మార్కెట్లకు మంచి పేరుంది. ఈ సంస్థ తాజాగా మురబ్బాలోని రియాద్ అవెన్యూ మాల్‌ లో "ఇండియా ఉత్సవ్" పేరుతో కొత్త సెక్షన్ ను ఏర్పాటు చేసింది. ఈ సెక్షన్ ను భారత వాణిజ్య,పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, లులూ గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ తో కలిసి ప్రారంభించారు. భారత్ కు చెందిన ఫుడ్ అండ్ టెక్స్ టైల్స్ ప్రొడెక్స్ట్ ను  ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం కల్పించేందుకు ఇటీవల వాణిజ్య శాఖ క్యాంపెయిన్ ప్రారంభించింది. అదే విధంగా 2023 ను "ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్" గా ఇండియా ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా భారత తృణ ధాన్యాలకు మార్కెటింగ్ కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఐతే ఈ కార్యక్రమంలో లులూ గ్రూప్ తమ వంతు సహకారం అందిస్తోంది. "ఇండియా ఉత్సవ్" పేరుతో ఏర్పాటు చేసిన సెక్షన్ లో దాదాపు 10 వేల ఇండియన్ ప్రొడెక్ట్స్ ను ఉంచింది. ఈ ఫోటోను మంత్రి పీయూష్ గోయల్ తన ట్విట్టర్ లో షేర్ చేశారు.  లులూ గ్రూప్ ను ప్రశంసించారు. అటు భారత్, సౌదీ మధ్య సంబంధాలకు తమ గ్రూప్ వారధిలా పనిచేస్తుండటం సంతోషంగా ఉందని లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ చెప్పారు. భారత ఫుడ్ ప్రాజెక్ట్స్ కు ప్రపంచ వ్యాప్తంగా మార్కెటింగ్ కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆయన అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com