తప్పిపోయిన బాలిక అచూకీ కనుగొన్న షార్జా పోలీసులు
- September 20, 2022
షార్జా : షార్జా లో తప్పిపోయిన బాలిక అచూకీని పోలీసులు కనుగొన్నారు. సీసీటీవీ కెమెరా పుటేజ్ ద్వారా బాలిక లోకేషన్ ను గుర్తించారు. ఆమెను క్షేమంగా వారి తల్లితండ్రులకు అప్పగించారు. ఐతే బాలిక తప్పిపోవటంతో ఆమెను ఎవరో కిడ్నాప్ చేశారని అంతా భావించారు. సోషల్ మీడియా లో చిన్నారి కిడ్నాప్ అయినట్లు ప్రచారం జరిగింది. దీంతో కేసును ఛాలెంజ్ గా తీసుకున్న పోలీసులు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ను జల్లెడ పట్టి మొత్తానికి అమ్మాయి అచూకీ కనుగొన్నారు. ఇంటి అడ్రస్ మరిచిపోయిన కారణంగానే బాలిక తప్పిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఆమె ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని చెప్పారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని నెటిజన్స్ కు సూచించారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి
- చరిత్ర సృష్టించిన యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం..
- ఆలస్యం చేసిన వారికి చివరి ఛాన్స్!
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!