బిగ్ బ్రేకింగ్: ఇనయా.! ఈ వారం ఔటేనా.?

- September 20, 2022 , by Maagulf
బిగ్ బ్రేకింగ్: ఇనయా.! ఈ వారం ఔటేనా.?

వర్మగారి హీరోయిన్‌గా పాపులర్ అయిన ముద్దుగుమ్మ ఇనయా సుల్తానా. బిగ్‌హౌస్‌లో తనను తాను బాగానే ఎలివేట్ చేసుకుంటూ వస్తోంది. గయ్యాలీ నోటితో బాగానే డిఫెన్స్ ఇస్తోంది. డే వన్ నుంచీ అదే ఎనర్జీతో తన వంతు పర్ఫామెన్స్ ఇస్తోంది ఇనయా సుల్తానా.
కానీ, ఎందుకో ఇనయాపై నెగిటివిటీ ఎక్కువగా వుంది. మొదటి వారమే ఇనయా హౌస్ నుంచి వెళ్లిపోతుందనే ప్రచారం గట్టిగా జరిగింది. కానీ, ఫస్ట్ వీక్ నో ఎలిమినేషన్‌తో ఇనయా తప్పించుకుంది. ఆ తర్వాత సెకండ్ వీక్‌లోనూ ఇనయా ఎలిమినేషన్ లిస్టులో వుంది.
కానీ, అనూహ్యంగా అభినయ శ్రీని హౌస్ నుంచి బయటికి గెంటేసి, ఇనయా సుల్తానాని సేవ్ చేశారు ఎందుకో. బయటికి వచ్చిన అభినయశ్రీ అదే గోడు వెల్లిబుచ్చుకుంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓటింగ్ ప్రకారం, ఇనయాతో పోల్చితే, తను టాప్‌లో వున్నాననీ, అన్యాయంగా లాస్ట్ మినిట్‌లో నన్ను ఎలిమినేట్ చేసేశారనీ అభినయశ్రీ వాపోయింది.
బిగ్‌బాస్ తనకు అన్యాయం చేసిందనీ అభినయ శ్రీ ఆరోపించింది. ఇక మూడో వారం నామినేషన్ల లిస్టులోనూ ఇనయా సుల్తానా పేరుంది. సో, ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి ఇనయా తప్పించుకోవడం సాధ్యం కాదంటూ లీకు వీరుల నుంచి అందుతోన్న గట్టి సమాచారం. మరి, ఈ వారమైనా ఇనయాని బయటకి పంపిస్తారా.? లేక, ఆమె స్థానంలో ఇంకెవరైనా బలి అవుతారా.? చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com