గాడ్ ఆఫ్ మాసెస్.! ఓవర్సీస్లో బాలయ్య బాబు జాతర.!
- September 20, 2022
నందమూరి నటసింహం బాలయ్య బాబు నటించిన మాస్ మసాలా ఎంటర్టైనర్ ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచింది. అప్పట్లో ఈ సినిమాకి చేసిన ప్రీ రిలీజ్ హంగామా అంతా ఇంతా కాదు. కానీ, దురదృష్టవశాత్తూ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ అందుకోలేకపోయింది.
కానీ, ఈ సినిమాలోని యాక్షన్ సీన్లూ, డైలాగులూ ఫ్యాన్స్‌లో చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేశాయ్. హీరో ఎలివేషన్ సీన్లు సరికొత్త రికార్డులు సృష్టించాయి. టబు, శ్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా వచ్చి 20 ఏళ్లు గడిచిన సందర్భంగా సినిమాని ప్రత్యేక షోలతో ప్రదర్శించబోతున్నారట. అది కూడా ఓవర్సీస్లో.
సెప్టెంబర్ 24, 25 తేదీల్లో ‘చెన్నకేశవరెడ్డి’ సినిమా స్పెషల్ షోలు వేయబోతున్నామంటూ తాజాగా ప్రకటన విడుదలైంది. అలాగే, ఓవర్సీస్లో మాత్రమే కాదు. రెండు తెలుగు రాష్ర్టాల్లోనూ ఈ సినిమాని స్పెషల్‌గా రీ రిలీజ్ చేయబోతున్నారట.
ఈ నేపథ్యంలోనే ‘గాడ్ ఆఫ్ మాసెస్.. బాలయ్య బాబు జాతర ఖండాంతరాలు దాటిన వేళ..’ అంటూ బాలయ్య బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అన్నట్లు ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయా సూపర్ హిట్ సినిమాలను స్పెషల్ షోలుగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ‘చెన్నకేశవరెడ్డి’ రూపంలో బాలయ్య ‘స్పెషల్’ హంగామా మొదలైందన్న మాట.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!