గుడ్ల ఎగుమతిపై నిషేధం విధించిన కువైట్
- September 20, 2022
కువైట్: 2022 అక్టోబరు 1 నుండి 2023 మే 21 వరకు తాజా గుడ్ల ఎగుమతిపై కువైట్ నిషేధం విధించింది. ఈ మేరకు వాణిజ్యం, పరిశ్రమల మంత్రి ఫహద్ అల్-షరియాన్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నుండి ప్రత్యేక లైసెన్సు పొందిన ఫామ్స్, కోడి, గుడ్డు ఉత్పత్తి కంపెనీలు నిషేధం నుండి మినహాయించబడతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆయా ఉత్పత్తులు స్థానిక మార్కెట్లో అందుబాటులో ఉంటాయని, వాటి ధరల్లో స్థిరత్వానికి తాజా నిర్ణయం దొహద పడుతుందని తన ఉత్తర్వుల్లో మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్ పర్యాటకులకు శుభవార్త.. 48 గంటల్లో సింగిల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా
- తెలంగాణ గవర్నర్ను కలిసిన డా.ఎన్.వి. సుధా కిరణ్
- సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026 ప్రారంభం
- మార్కెట్ లోకి రూ.500 ప్లాస్టిక్ నోట్లు? RBI క్లారిటీ
- 50 ఏళ్ల వయసు వచ్చే వరకు రెన్యువల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడిటీ!
- ప్రత్యేక రాష్ట్రం సాధించినా తెలంగాణ ప్రజల బతుకులు మారలేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- ప్రపంచ రికార్డు సృష్టించిన మేఘా ఇంజనీరింగ్ అద్భుతం..
- మహిళల ఆశీర్వాదంతో 2034 వరకు మేమే అధికారంలో ఉంటాం: సీఎం రేవంత్
- వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం..కూటమి ప్రభుత్వం పై విమర్శలు
- యూఏఈ లాటరీ గెలుచున్న సెక్యూరిటీ గార్డు









