నజీజ్ పోర్టల్ అప్‌గ్రేడ్.. కొత్తగా మరో 10 సర్వీసులు
- September 20, 2022
సౌదీ: నజీజ్ పోర్టల్ అప్‌గ్రేడ్ అయింది. కొత్తగా మరో 10 సర్వీసులు ఖాతాదారులకు అందుబాటులోకి వచ్చాయి. 10 న్యాయపరమైన ఇ-సర్వీసులు, ఐదు ఇంటరాక్టివ్ ఫీచర్‌లను జోడించడం ద్వారా Najiz.sa పోర్టల్‌ను అప్‌గ్రేడ్ చేసినట్లు సౌదీ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ (MoJ) ప్రకటించింది. ఖాతాదారులకు సంబంధిత విధానాలు, షెడ్యూల్ చేసిన సెషన్‌లను వెంటనే వీక్షించడానికి కొత్త సర్వీసులు వీలు కల్పిస్తుందని తెలిపింది. అప్‌గ్రేడ్ ద్వారా క్లయింట్‌లు వారి కేసులపై తాజా అప్‌డేట్‌లను వెంటనే అందుకోవచ్చు. దీంతోపాటు ఫైలింగ్‌ల కోసం మరింత సులువుగా సెర్చింగ్ చేయడంతోపాటు తమ కేసుల తీర్పులను సులువుగా తెలుసుకునే విధంగా పోర్టల్ లో మార్పులు చేసినట్లు పేర్కొన్నారు. న్యాయస్థానాలు, నోటరైజేషన్‌ను కవర్ చేసే 140 కంటే ఎక్కువ న్యాయపరమైన ఇ-సేవలను నజీజ్ పోర్టల్ అందిస్తున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







