విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్
- September 22, 2022
దోహా: FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 సందర్భంగా 2022 నవంబర్ 1 నుండి విజిట్ వీసాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రపంచ కప్ సమయంలో హయ్యా కార్డ్ హోల్డర్‌లను మాత్రమే అనుమతించనున్నట్లు పేర్కొంది. వాయు, భూమి, సముద్ర సరిహద్దుల ద్వారా వచ్చే సందర్శకులందరికి ఈ నిబంధన వర్తిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. తిరిగి 2022 డిసెంబర్ 23 నుండి విజిట్ వీసాలను పునఃప్రారంభించనున్నట్లు పేర్కొంది. హయ్యా కార్డ్ హోల్డర్లు 2023 జనవరి 23 వరకు దేశంలో ఉండడానికి అనుమతి ఉందని మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, ఖతార్ పౌరులు, నివాసితులు,GCC పౌరులు ఖతారీ ID కార్డును కలిగి ఉన్న వారికి మినహాయింపునిచ్చారు. అలాగే వ్యక్తిగత రిక్రూట్‌మెంట్ వీసాలు, వర్క్ ఎంట్రీ పర్మిట్‌లను కలిగి ఉన్నవారితోపాటు మానవతా కేసుల్లో వచ్చే వారికి తాజా నిబంధనల నుంచి మినహాయింపునిచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!
- యూఏఈ, ఖతార్ టార్గెట్ కథనాలను ఖండించిన జీసీసీ, అరబ్ పార్లమెంట్..!!
- బహ్రెయిన్ లో కొత్త విద్యా సంవత్సరం సెప్టెంబర్ 3న ప్రారంభం..!!
- AI శిక్షణతో ప్రభుత్వ రంగ సామర్థ్యాలు బలోపేతం..!!
- ఒమన్ తీరంలో భారతీయ నౌక 'విరాట్ 1' మిస్సింగ్..!!
- భారీ వర్షాల నేపథ్యంలో బేగంపేటలో పరిస్థితుల సమీక్షించిన సీపీ సుమతి
- ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచనా
- జూలై 4 నుంచి అలీ ఖమేనీ అంత్యక్రియలు..ఇరాన్ కీలక ప్రకటన
- తిరుపతి ఫిల్మ్ సిటీ విజన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన









