ఆ చర్య వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు: జూనియర్ ఎన్టీఆర్
- September 22, 2022
హైదరాబాద్: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి తన తాత పేరు తీసి వైఎస్‌ఆర్ పేరు పెట్టడంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. ఒకరి పేరు తీసి... మరొకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్‌ఆర్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదంటూ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్‌లు ఇద్దరూ విశేష ప్రజాధరణ పొందిన నేతలన్నారు. వర్సిటీకి పేరు మార్పుతో ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, వారి స్థాయిని..తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్నవారి జ్ఞాపకాలను చెరిపివేయలేరంటూ ట్వీట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్ విజయవాడలోని డా.ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పేరును డా. వైఎస్‌ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది టీడీపీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిర్ణయాన్ని సీనియర్ ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ సైతం తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై తాజాగా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ మేరకు ట్వీట్ చేశారు. ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం వల్ల ఎన్టీఆర్ స్థాయి తగ్గదంటూ... ట్వీట్‌లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు