ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిపై ఒమన్ నిషేధం

- September 22, 2022 , by Maagulf
ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిపై ఒమన్ నిషేధం

ఒమన్: మరో మూడు నెలల్లో ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రి కైస్ యూసెఫ్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం నం. 519/2022 ప్రకారం.. కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచులను దిగుమతి చేసుకోడం నిషేదమన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే RO1,000 ($2,597) జరిమానా విధించబడుదని హెచ్చరించారు.అదే ఉల్లంఘన పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందన్నారు. ఒమన్ ఎన్విరాన్‌మెంట్ అథారిటీ ఈ ఏడాది జనవరి 1న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్‌లపై నిషేధాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సింగిల్-యూజ్ బ్యాగ్‌ల స్థానంలో మందమైన 50-మైక్రాన్ బ్యాగ్‌లను చాలా షాపుల్లో కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com