నమ్మకం సరే నాగశౌర్యా.! ఈసారేం చేస్తావో!
- September 22, 2022
యంగ్ హీరో నాగశౌర్యకు అర్జెంటుగా ఓ హిట్టు పడాలి. ‘వరుడు కావలెను’ సినిమాతో దారుణంగా దెబ్బ తినేశాడు నాగశౌర్య. అంతకు ముందూ వరుస ఫ్లాపులూ నాగశౌర్యని వేధించాయ్. దాంతో, ఈ సారి రాబోయే సినిమా ఎలాగైనా సూపర్ హిట్ కావాలనే ఆశతో వున్నాడు నాగశౌర్య.
అందుకు తగ్గట్లుగానే కథని బలంగా నమ్మి, సొంత బ్యానర్ అయిన ఐరా క్రియేషన్స్‌లో నిర్మించేందుకు సిద్ధమయ్యాడు. అదే ‘కృష్ణ వ్రింద విహారి’. పాప్ సింగర్ కమ్ యాక్ర్టెస్ అయిన షెర్లీ సేటియా ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది.
ఈ సినిమా ఈ శుక్రవారమే అంటే, సెప్టెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. సిటీలో సాప్ట్వేర్ ఉద్యోగం చేసుకునే అగ్రహారానికి చెందిన బ్రాహ్మణ కుర్రోడి ప్రేమకథే ఈ ‘కృష్ణ వ్రింద విహారి’. రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ అనీష్ ఆర్. కృష్ణ.
ఇప్పటికైతే పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమా. ఈ సిట్యువేషన్ చూసి, సినిమా సూపర్ హిట్ అని శౌర్య ఫిక్స్ అయిపోయాడట. అలా ఎలా.? ఫిక్స్ అవుతాడు.? ఆడియన్స్ వర్డిక్ట్ ఎలా వుంటుందనేది ఫస్ట్ డే ఫస్ట్ షో పడితే కానీ తెలీదు.
ఇక, ముఖ్యంగా హీరోయిన్ ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపిస్తోంది. హిందీలో ‘మస్కా’, నిక్కమ్మా’ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇదే తొలి తెలుగు సినిమా. హిట్ అవుతుందో, ఫట్ అవుతుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- సూక్ వాకిఫ్ లో 'ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్' ప్రారంభం..!!
- సోషల్ మీడియా బ్యాన్: స్క్రోలింగ్ చేస్తూ నిద్ర, భోజనం మానేస్తున్న పిల్లలు..!!
- కొన్ని వారాల్లోనే చమురు ఉత్పత్తి పునరుద్ధణ..!!
- మానవ అక్రమ రవాణా కేసులో మహిళకు ఏడేళ్ల జైలు శిక్ష..!!
- సౌదీలో 65% మంది పిల్లలు అనుచితమైన కంటెంట్‌కు గురవుతున్నారు..!!
- మిలన్లో ఒమన్-ఇటలీ కల్చరల్ ఎక్స్ పో ప్రారంభం..!!
- ఇరాన్ శాంతి ఒప్పందం..అమెరికా, ఇజ్రాయెల్ మధ్య తీవ్ర విభేదాలు
- టెలిగ్రామ్ పై కేంద్రం విధించిన నిషేధాన్ని సమర్ధించిన ఢిల్లీ హైకోర్టు
- TOMCOM ఆధ్వర్యంలో ఇజ్రాయెల్‌లో కేర్ గివర్స్‌కు భారీ ఉద్యోగ అవకాశాలు
- ఫాస్ట్ ట్రాక్ పై అమెరికా వీసా ఛాన్స్..కానీ భారీ ఖర్చు!







