మాస్ రాజా ఈ ఏడాది ‘ధమాకా’ చూపిస్తాడా.?
- September 22, 2022మాస్ రాజా రవితేజ నుంచి వస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయ్ ఈ మధ్య. ఇక తదుపరి సినిమాతో తన ‘ధమాకా’ చూపిస్తానంటున్నాడు రవితేజ.
అదేనండీ, రవితేజ తదుపరి చిత్రం ‘ధమాకా’. నక్కిన త్రినాధరావు ఈ సినిమాకి దర్శకుడు. ‘పెళ్లి సందడి’ ఫేమ్ శ్రీ లీల హీరోయిన్గా నటిస్తోంది. ఇంతవరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా ప్రోమోలు సో సో గా వున్నాయనే చెప్పాలి. అయితే, ఈ సినిమాతో మాస్ రాజా ఈజ్ బ్యాక్ అంటూ ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు లేటెస్టుగా ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే, ఈ ఏడాది వచ్చిన రవితేజ సినిమాలన్నీ ఢమాల్ అవ్వడంతో, ఈ సినిమా రిలీజ్ పట్ల మేకర్లు కొంత అసంతృప్తితో వున్నారట.
ఈ సినిమాతో పాటూ, రవితేజ చేతిలో మరో రెండు సినిమాలున్నాయ్. అవే ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’ చిత్రాలు. ఈ సినిమాలను కూడా సమాంతరంగా పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు మాస్ రాజా రవితేజ.
ఈ రెండు సినిమాల్నీ వచ్చే ఏఢాది రేస్‌లో వుంచి, ‘ధమాకా’ని ఈ ఏడాదిలోనే రేస్‌లోకి దించాలన్న ఆలోచన జరుగుతోందట. ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే, మాస్ రాజా ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటారు చూడాలి మరి, ఏం జరుగుతుందో.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?