ఎట్టకేలకు ‘ఇండియన్ 2’ సెట్ల్లోకి అడుగు పెట్టిన కమల్ హాసన్.!
- September 22, 2022ఆగిపోయిందనుకున్న ‘భారతీయుడు 2’ సినిమాని ఎట్టకేలకు పట్టాలెక్కించారు లోక నాయకుడు కమల్ హాసన్. కరోనాకి ముందే సెట్లో జరిగిన క్రెయిన్ యాక్సిడెంట్ కారణంగా ఈ సినిమాని అర్ధాంతరంగా నిలిపేశారు. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమాని లాంచ్ ఛేశాడు. కామ్‌గా షూటింగ్ కూడా కానిచ్చేస్తున్నాడు.
ఇటీవల ‘విక్రమ్’ సినిమాతో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఫామ్‌లోకి వచ్చిన విశ్వనటుడు కమల్ హాసన్, అప్పటికప్పుడు శంకర్‌ని ఒప్పించి ఈ సినిమాని తిరిగి సెట్స్ మీదికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారు. ఫ్రయత్నాలు ఫలించడంతో సడెన్‌గా ‘ఇండియన్ 2’ పట్టాలెక్కేసింది.
సమాంతరంగా అటు చరణ్ సినిమానీ, ఇటు కమల్ సినిమానీ పూర్తి చేస్తానని శంకర్ ప్రకటించారనుకోండి. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా ‘ఇండియన్ 2’ సెట్స్‌లో కమల్ హాసన్ సందడి షురూ చేశారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆల్రెడీ కొంతమేర షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి, విడుదల చేయాలని కమల్ అండ్ టీమ్ యోచిస్తోందట.
ఈ సినిమా తిరిగి ప్రారంభం కావడంతో హీరోయిన్లు కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ పట్టరాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత..హాస్పిటల్స్ అసోసియేషన్ నిర్ణయం
- శ్రీవారి దర్శనం..వీఐపీ టికెట్లు పునఃప్రారంభం
- 20 ఆటోమేకర్ల నుండి వాహనాల దిగుమతిపై సౌదీ నిషేధం
- కారులో యువతి డ్యాన్స్.. డ్రైవర్‌పై బహిష్కరణ వేటు
- ఎయిర్ టాక్సీలు.. త్వరలో పైలట్ల నియామకం
- యూఏఈలో హెల్త్ సర్వే ప్రారంభం
- జోర్డాన్‌ను సందర్శించనున్న హెచ్ఎం సుల్తాన్
- ఏడు రెసిడెన్షియల్ భవనాలకు పవర్ డిస్కనెక్ట్
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..