అబుధాబిలో పాక్షికంగా కూలిన మస్జీదు
- September 23, 2022యూఏఈ: అబుధాబిలో నిర్మాణంలో ఉన్న ఓ మస్జీదు పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆసుపత్రికి తరలించారు. అల్ బతీన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న మస్జీదులో కొంత భాగం కూలిపోయిన ప్రదేశాన్ని సమాచారం అందగానే అబుధాబి పోలీసులు, అబుదాబి సివిల్ డిఫెన్స్ అథారిటీ బృందాలు చేరుకొని అక్కడున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చినట్లు పోలీసు ఉన్నతాధికారులు చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ఘటనలో కొందరికి స్వల్ప గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. కూలిన మస్జీదును చూసేందుకు ఎవరూ రావొద్దని, అధికారిక మార్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే అనుసరించాలని ప్రజలకు అబుధాబి పోలీసులు కోరారు.
తాజా వార్తలు
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు