‘ఆర్ఆర్ఆర్’కి ‘ఆస్కార్’ అవసరమా.! నిజాలు బయటపెట్టిన నిఖిల్.!
- September 23, 2022
ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఆస్కార్ బరిలో వుంచాలని మేకర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఆస్కార్ నామినేషన్ల నుంచి పక్కన పెట్టేసి, ‘ఛెల్లె షో’ అనే గుజరాతీ మూవీని ఆస్కార్ నామినేషన్లలో సెలెక్ట్ చేసింది ఇండియన్ ఫిలిం ఫెడరేషన్.
ఈ అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తం కాగా, యంగ్ హీరో నిఖిల్ ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవసరమా.? అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరదే.! నిజాలు మాట్లాడితే అలాగే వుంటది. నిఖిల్ చెప్పే మాటలను అర్ధం చేసుకోకుండా అపార్డం చేసుకుంటే తప్పులో కాలేసినట్లే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు. ఎందరో సినీ ప్రముఖులు, దేశ దేశాల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రశంసిస్తున్నారు. ఇంతకు మించిన గౌరవ ఆస్కారం ఇంకేముంటుంది. ఇదే నిఖిల్ చెప్పిన మాటల్లోని అర్ధం. ‘ఆస్కార్’పై తనకు అంత మంచి అభిప్రాయం కూడా లేదని నిఖిల్ చెప్పాడు.
ఇటీవలే స్పెయిన్లో ఆర్ఆర్ఆర్ సినిమాని వీక్షించాడట నిఖిల్. అక్కడి ధియేటర్లలో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తనకు ఎంతో గర్వంగా అనిపించిందనీ నిఖిల్ పేర్కొన్నాడు. అంతేగా.! అసలు సిసలు విజయ గర్వం అంటే ఇదేగా.!
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







