‘ఆర్ఆర్ఆర్’కి ‘ఆస్కార్’ అవసరమా.! నిజాలు బయటపెట్టిన నిఖిల్.!
- September 23, 2022ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు దక్కించుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని ఆస్కార్ బరిలో వుంచాలని మేకర్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దురదృష్టవశాత్తూ ‘ఆర్ఆర్ఆర్’ మూవీని ఆస్కార్ నామినేషన్ల నుంచి పక్కన పెట్టేసి, ‘ఛెల్లె షో’ అనే గుజరాతీ మూవీని ఆస్కార్ నామినేషన్లలో సెలెక్ట్ చేసింది ఇండియన్ ఫిలిం ఫెడరేషన్.
ఈ అంశంపై సర్వత్రా విస్మయం వ్యక్తం కాగా, యంగ్ హీరో నిఖిల్ ‘ఆర్ఆర్ఆర్’కి ఆస్కార్ అవసరమా.? అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మరదే.! నిజాలు మాట్లాడితే అలాగే వుంటది. నిఖిల్ చెప్పే మాటలను అర్ధం చేసుకోకుండా అపార్డం చేసుకుంటే తప్పులో కాలేసినట్లే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు అమితంగా ఆదరిస్తున్నారు. ఎందరో సినీ ప్రముఖులు, దేశ దేశాల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాని ప్రశంసిస్తున్నారు. ఇంతకు మించిన గౌరవ ఆస్కారం ఇంకేముంటుంది. ఇదే నిఖిల్ చెప్పిన మాటల్లోని అర్ధం. ‘ఆస్కార్’పై తనకు అంత మంచి అభిప్రాయం కూడా లేదని నిఖిల్ చెప్పాడు.
ఇటీవలే స్పెయిన్లో ఆర్ఆర్ఆర్ సినిమాని వీక్షించాడట నిఖిల్. అక్కడి ధియేటర్లలో ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తే తనకు ఎంతో గర్వంగా అనిపించిందనీ నిఖిల్ పేర్కొన్నాడు. అంతేగా.! అసలు సిసలు విజయ గర్వం అంటే ఇదేగా.!
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..