FIFA వరల్డ్ కప్.. అల్ బిడ్డా పార్క్ మూసివేత
- September 24, 2022
ఖతార్: అల్ బిడ్డా పార్క్‌లోని వాడి అల్ సెయిల్ ప్రాంతాన్ని మూసివేసినట్టు సుప్రీం కమిటీ ఫర్ డెలివరీ & లెగసీ (SC) ప్రకటించింది. నవంబర్‌లో FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 ప్రారంభమయ్యే వరకు ఈ మూసివేత నిబంధన అమల్లో ఉంటుందని పేర్కొంది. 2022 నవంబర్ 20 నుండి డిసెంబర్ 18 వరకు ఫుట్‌బాల్ టోర్నమెంట్ సందర్భంగా అల్ బిడ్డా పార్క్‌లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్‌కు అవసరమైన సన్నాహాల కోసం మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సుప్రీం కమిటీ తమ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. ఫుట్‌బాల్ అభిమానులు అల్ బిడ్డా పార్క్‌లో జరిగే FIFA ఫ్యాన్ ఫెస్టివల్‌కు తరలివస్తారని వెల్లడించింది. ఇక్కడ ఫుట్ బాల్ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం ప్రదర్శన ఉంటుందని, స్టేజ్ ప్రదర్శనలు, ఫుడ్ అవుట్‌లెట్‌లు, సాంస్కృతిక కార్యకలాపాలు, స్పాన్సర్ యాక్టివేషన్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







