విద్యార్థులపై దాడి ఘటనలో ఉపాధ్యాయుడు నిర్దోషి: విద్యాశాఖ
- September 24, 2022
బహ్రెయిన్: ఇద్దరు విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసినట్లు వీడియో ద్వారా తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము చేసిన దర్యాప్తులో సదరు ఉపాధ్యాయుడు నిర్దోషి అని తేలిందని ప్రకటించింది. తమ విచారణలో ఓ విద్యార్థినే అసలు నిందితుడని తేలిందని పేర్కొంది. ఉపాధ్యాయుడిని అవమానించడం, రెచ్చగొట్టడం వంటి చర్యలకు విద్యార్థి పాల్పడ్డాడని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో విద్యార్థిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు, సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. విషయాన్ని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికారులకు తెలపాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుడు తన కుమారుడిపై, గాయాలతో బాధపడుతున్న మరో విద్యార్థిపై దాడి చేశారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు విడుదల చేసి వీడియో వైరల్ కావడంతో విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. ఈ ఘటన ఇసా టౌన్ ప్రైమరీ ప్రిపరేటరీ స్కూల్‌లో జరిగింది.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







