ఎమిరేట్స్ ID పోయిందా.. అయితే ఇలా చేయండి
- September 25, 2022
యూఏఈ: ఎమిరేట్స్ ID కార్డు పోయిందా.. దొంగలు ఎత్తుకెళ్లారా.. ఏం ఫర్వాలేదు. ఐడీని తిరిగి పొందేందుకు దరఖాస్తు ఎలా చేయాలో యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ (DGOV) వెల్లడించింది. ఎవరైనా అతని/ఆమె ఎమిరేట్స్ ID కార్డ్‌ను పోగొట్టుకున్నా లేదా అది దొంగిలించబడిన లేదా పాడైపోయినా .. అతను/ఆమె వెంటనే గుర్తింపు, పౌరసత్వం, కస్టమ్స్, ఫెడరల్ అథారిటీ నుండి కొత్త ఎమిరేట్స్ ID కార్డును పొందేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ID కార్డ్‌ను పోగొట్టుకుంటే తప్పనిసరిగా సమీపంలోని ICP కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌ని సందర్శించి విషయాన్ని తెలపాలి. దీంతో దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న కార్డును వెంటనే అధికారులు డియాక్టివేట్ చేస్తారు. అక్కడే కొత్త కార్డు కోసం దరఖాస్తు సమర్పించాలి. అలాగే దెబ్బతిన్న కార్డుల స్థానంలో కొత్త కార్డును పొందేందుకు పాత కార్డును దరఖాస్తుతో అందజేయాలి. యూఏఈ జాతీయులు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉన్న పాస్‌పోర్టును, GCC జాతీయులు యూఏఈలో తమ నివాసాన్ని రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రవాస నివాసితులు చెల్లుబాటు అయ్యే రెసిడెన్సీ పర్మిట్‌తో స్టాంప్ చేయబడిన వారి అసలు పాస్‌పోర్ట్‌ను తప్పనిసరిగా వెంట తీసుకురావాల్సి ఉంటుందని యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ వివరించింది. ఇక 15 ఏళ్లలోపు పిల్లలకు సంబంధించి వారి ఒరిజినల్ జనన ధృవీకరణ పత్రాన్ని అందించాల్సి ఉంటుంది. ఏదైనా ICP కస్టమర్ హ్యాపీనెస్ సెంటర్‌లలో లేదా iTunes, Google Playలో అందుబాటులో ఉన్న UAE ICP యాప్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఐడీ రీప్లేస్‌మెంట్ కోసం తప్పనిసరిగా Dhs300 చెల్లించాలి. అలాగే టైపింగ్ సెంటర్‌ల ద్వారా దరఖాస్తు చేసినట్లయితే Dhs70 అప్లికేషన్ రుసుము లేదా ICP వెబ్‌సైట్‌లోని eForm ద్వారా దరఖాస్తు చేస్తే Dhs40 చెల్లించాల్సి ఉంటుంది. ఈ రుసుములు UAE జాతీయులు, GCC జాతీయులు, ప్రవాస నివాసితులందరికీ వర్తిస్తాయి. ID కార్డు కోసం దరఖాస్తును సమర్పించిన 48 గంటలలోపు కొత్తది జారీ అవుతుందని యూఏఈ డిజిటల్ గవర్నమెంట్ వెల్లడించింది.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







