కూడళ్లలో వాహనాలను నిలిపితే Dh500 జరిమానా
- September 25, 2022
యూఏఈ: కూడళ్లలో వాహనాలను ఆపడం వల్ల కలిగే ప్రమాదాల గురించి రస్ అల్ ఖైమా(RAK) పోలీసులు శనివారం వాహనదారులను హెచ్చరించారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ ని షేర్ చేశారు. కూడళ్లలో వాహనాలను నిలిపి ట్రాఫిక్ కి ఇబ్బందులు కలిగిస్తే 500 దిర్హామ్ జరిమానా విధించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ముఖ్యమైన సమావేశాలు లేదా పనులకు వెళ్లే వారితో సహా ఇతర వాహనదారులకు ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుందని తెలిపారు. అలాగే క్లిష్టమైన ఆరోగ్య స్థితిలో ఉన్న వ్యక్తికి అంబులెన్స్ సేవను ఆలస్యం చేస్తుందని RAK పోలీసులు అవగాహన వీడియోలో తెలిపారు. రోడ్లను అందరికీ సురక్షితంగా మార్చే ప్రయత్నాల్లో భాగంగా ఎమిరేట్స్‌లోని పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు జారీ చేస్తూ ట్రాఫిక్ నియమాలు, నిబంధనలను వాహనదారులకు గుర్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







