‘బిగ్’ ఎలిమినేషన్: బిగ్‌బాస్‌కి వాళ్లంటే అస్సలు నచ్చరా.?
- September 26, 2022బిగ్‌బాస్ షో మూడో వారం ఎలిమినేషన్లో భాగంగా నేహా చౌదరిని హౌస్ నుంచి బయటికి పంపించేశారు. నిజానికి నేహా చౌదరిలాంటి కంటెస్టెంట్ బిగ్‌బాస్ హౌస్‌కి అర్హురాలు. తనవంతు ఆట ఆడింది. స్టఫ్ క్రియేట్ చేసింది. వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా.
కానీ, బిగ్‌బాస్ షోకి స్ర్టాంగ్ కంటెస్టెంట్స్ అంటే అర్ధం వేరే వుంది కాబోలు. ఎవరైతే ఆట ఆడతారో, స్ర్టాంగ్ అనిపిస్తారో వాళ్లనే ఇంటి నుంచి త్వరగా బయటికి పంపించేస్తుంటాడు. మొదటి వారం బయటికి వచ్చేసిన ఇద్దరిలో షానీ సంగతి అటుంచితే, అభినయశ్రీ ఎలిమినేషన్ పట్ల అనేక రకాల అనుమానాలున్నాయ్.
ఇక మూడో వారం కూడా అంతే. నేహా చౌదరి అస్సలు ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంటే కాదు. లీకు వీరుల ద్వారా అందిన సమాచారం ప్రకారం నేహా చౌదరియే ఎలిమినేట్ క్యాండిడేట్ అనుకున్నా కానీ, అంచనాలకు మించి బిగ్‌బాస్ ఏదో మ్యాజిక్ చేస్తాడని ఆడియన్స్ భావించారు.
కానీ, అలాంటి మ్యాజిక్కులేమీ బిగ్‌బాస్ హౌస్‌లో జరగవని మరోసారి ప్రూవ్ అయ్యింది. ఇక, నేహా చౌదరి విషయానికి వస్తే, అప్పుడే వచ్చేస్తానని అస్సలు అనుకోలేదు.. అంటూ ఆశ్చర్యానికి గురైంది నేహా చౌదరి. నేహా చౌదరి మంచి డాన్సర్. అప్పియరెన్స్, స్ర్కీన్ ప్రెజెన్స్, గేమ్ స్ర్టాటజీ.. ఇలా ఏది తీసుకున్నా, తనకంటూ కొన్ని ఇంటెలిజెంట్ స్కిల్స్ వున్నాయ్.
కానీ, ఏం లాభం.? పేరుకే బిగ్ గేమ్ షో. ఎవరైతే బాగా ఆడరో, వాళ్లకే హౌస్‌లో చోటు.. రూల్ ప్రకారం గేమ్ ఆడేవాళ్లని బిగ్‌బాస్ అస్సలు నచ్చడు.. అని రాను రాను మరింత బలంగా ప్రూవ్ చేసుకుంటున్నాడు బిగ్‌బాస్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ