పగటి వేళ బహిరంగ భోజన-పానీయ సేవనం నిషిద్ధం
- June 16, 2015
ఒమాన్ శిక్షాస్మృతి ప్రకారం, అతి పవిత్రమైన రమదాన్ మాసంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు పగలు భోజనం, పానీయసేవనం పూర్తిగా నిషిద్ధమని, అలా బహిరంగంగా భోజనం, తాగడం చేసేవారికి10 రోజుల జైలుశిక్ష లేదా జరిమానా విధించబడుతుందని రాయల్ ఒమాన్ పోలీస్ అధికారులు హెచ్చరించారు. సూఫ్యాన్ ఖలీఫా, సర్వశక్తివంతుడైన అల్లాకు ఒడంబడి, బహిరంగ ప్రదేశాలలో భుజింపవద్దని అందరికీ పిలుపునిచ్చారు.
మస్కట్ మ్యూనిసిప్యాలిటీ అధికారి ఒకరు, రమదాన్ సందర్భంగా అన్ని రెస్టారెంట్లు, కేఫ్‌లు మూసివేయాలని, భోజనానికి రెస్టారెంట్లపై ఆధారపడే ముస్లిమేతర కార్మికుల కోసం, కొన్ని రెస్టారెంట్లకు అనుమతినిచ్చామని, ఐతే అవి వారి పనిప్రదేశాలకే భోజనాన్ని పంపించాలని, వారు బయట ప్రదేశాలలో కాక, లోపలనే భుజించాలని ఆయన వివరించారు. ఉదయం 8 గం. నుండి అర్థరాత్రి వరకు, ఆహార పర్యవేక్షణా దళాలను నియోగించామని కూడా ఆయన తెలిపారు.
ఇండియన్ సోషల్ క్లబ్ చైర్మన్ - Dr. సతీష్ నంబియార్, తాను గత 18 సాంవత్సరాలుగా రమదాన్ ఉపవాశాలను పాటిస్తున్నానని, మధ్యలో ఆరోగ్యకారణాల వలన అంతరాయం కలిగినప్పటికీ, స్థానిక ముస్లిం సోదరులకు ఐక్యతా సూచకంగా మరల కొనసాగిస్తున్నానని తెలిపారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







