పార్కింగ్‌ ఇన్‌స్పెక్టర్ల కోసం కొత్త యాప్‌

- April 18, 2016 , by Maagulf
పార్కింగ్‌ ఇన్‌స్పెక్టర్ల కోసం కొత్త యాప్‌

రోడ్స్‌ మరియు ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ) కొత్త స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్‌, పార్కింగ్‌ ఇన్‌స్పెక్టర్లకు ఉపయోగపడేలా రూపొందించారు. ఈ యాప్‌ ద్వారా దుబాయ్‌ ఎమిరేట్‌లో పార్కింగ్‌ ఇన్‌స్పెక్టర్లకు సమయం వృధా అవడంతోపాటు, మెరుగైన సౌకర్యాలను అందించడానికి వీలవుతుంది. కొత్త పర్మిట్‌లు ఇవ్వడం, పాత పర్మిట్లను రెన్యూవల్‌ చేయడం, పేవ్‌మెంట్స్‌ ఆక్యుపేషన్‌, ప్రైవేట్‌ ల్యాండ్‌ ప్లాట్లను పార్కింగ్‌ ఏరియాస్‌గా మార్చడం, సిటిజన్ల కోసం ప్రైవేట్‌ పార్కింగ్‌ పర్మింట్స్‌ ఇలాంటి సౌకర్యాలను ఈ యాప్‌ ద్వారా అందుబాటులో ఉంచారు. దుబాయ్‌ స్మార్ట్‌ గవర్నమెంట్‌లో భాగంగా అందుబాటులో ఉన్న సాంకేతికతను వినియోగించుకుంటూ దుబాయ్‌ వాసులకు మెరుగైన సౌకర్యాలను అందించడమే లక్ష్యంగా ఆర్‌టీఏ తీసుకుంటన్న చర్యల్లో ఈ స్మార్ట్‌ యాప్‌ కూడా ఒకటి అని ఆర్‌టిఏ ట్రాఫిక్‌ అండ్‌ రోడ్స్‌ ఏజెన్సీ సీఈఓ మైతా బిన్‌ అదాయ్‌ చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com