యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
- September 28, 2022
యూఏఈ: యూఏఈలో నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హాములు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు కెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత







