మహేష్ కోసం త్రివిక్రమ్ ఆ తప్పు చేస్తాడా.?
- September 28, 2022క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకోవడంలో త్రివిక్రమ్‌ది సెపరేట్ పంథా. ఆయా పాత్రల కోసం ఆయన ఎంచుకునే నటీనటులు, వాళ్లకు వచ్చిన గుర్తింపు వేరే లెవల్. అయితే, ఈ సారి మాత్రం త్రివిక్రముడి అంచనాల్ని అభిమానులు తప్పు పడుతున్నారు.
మహేష్ బాబుతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న సినిమా కోసం ఈ సారి ఓ సీనియర్ నటుడ్ని రంగంలోకి దించాలనుకుంటున్నాడట మాటల మాంత్రికుడు. ఆయన సెలెక్షన్‌పై మహేష్ అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారట.
అదేంటీ.? త్రివిక్రమ్ సెలెక్షన్నే తప్పు పట్టేలా, ఆ సీనియర్ నటుడు ఎవరై వుంటారబ్బా.? అనుకుంటున్నారా.? ఇంకెవరు మంచు మోహన్ బాబు. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం మోహన్‌బాబుతో త్రివిక్రమ్ సంప్రదింపులు చేస్తున్నట్లు కాస్త ఉప్పందింది.
దాంతో, అభిమానులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియాలో ప్రచారానికి దిగారు. మోహన్ బాబు వద్దంటే వద్దు బాబోయ్ అంటూ రచ్చకు దిగారట. మరి, అభిమానుల్ని కాదంటే ఆ రిజల్ట్ ఎలా వుంటుందో ఊహించలేనంత అమాయకుడు కాదు త్రివిక్రమ్. నిజంగానే మోహన్‌బాబు ఆలోచన చేస్తున్నాడా.? లేక, జస్ట్ రిఫరెన్స్ కోసం పొగ రాజేశాడా.? అనేది తెలియాలంటే, ఇంకాస్త టైమ్ వెయిట్ చేయాల్సిందే.
ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసేసి, నెక్స్ట్ షెడ్యూల్ కోసం వచ్చే నెలలో ముహూర్తం ఫిక్స్ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. అన్నట్లు ఈ సినిమాలో పూజా హెగ్దే, మహేష్‌కి జోడీగా నటిస్తోంది.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్