నాగ్ ‘ది ఘోస్ట్’ పై ఆకాశాన్నంటేలా అంచనాలు.!
- September 28, 2022
కింగ్ నాగార్జున హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ది ఘోస్ట్’. మొదట్నుంచీ ఈ సినిమాపై అంచనాలున్నాయ్. విషయమున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడం, నాగార్జునను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఈ సినిమాలో ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి.
అంత కాన్ఫిడెన్స్ వుంది కనుకే, ఈ సినిమాని దసరా బరిలో దించుతున్నారు. అందులోనూ, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పోటీగా దించడం విశేషం. ఇక లేటెస్టుగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ లభించింది.
ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారట. కింగ్ నాగ్ నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్‌గా ఈ సినిమాలో నాగార్జున నటనను అభివర్ణిస్తున్నారట. నో డౌట్ మరో పదేళ్లు నాగార్జున హీరోగా కొనసాగొచ్చు.. అంటూ కితాబిచ్చేస్తున్నారట.
కొన్ని కొన్ని సీన్లు ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయని చెప్పారట. చాలా గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే అని డైరెక్టర్‌కీ ప్రశంసలు దక్కుతున్నాయట. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘బంగార్రాజు’తో ఓ మోస్తరు సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న నాగార్జున, ‘ది ఘోస్ట్’గా రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం
- అంగరంగ వైభవంగా 77వ ఎమ్మీ అవార్డుల వేడుక..
- శంకర నేత్రాలయ USA దత్తత గ్రామ పోషకులకు సత్కారం
- బుల్లెట్ ట్రైన్ ఇక కేవలం 2 గంటల్లో ప్రయాణం