నాగ్ ‘ది ఘోస్ట్’ పై ఆకాశాన్నంటేలా అంచనాలు.!
- September 28, 2022కింగ్ నాగార్జున హీరోగా రూపొందుతోన్న సినిమా ‘ది ఘోస్ట్’. మొదట్నుంచీ ఈ సినిమాపై అంచనాలున్నాయ్. విషయమున్న డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడం, నాగార్జునను ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా, ఈ సినిమాలో ప్రెజెంట్ చేయడంతో ఈ సినిమాపై అంచనాలు బాగున్నాయి.
అంత కాన్ఫిడెన్స్ వుంది కనుకే, ఈ సినిమాని దసరా బరిలో దించుతున్నారు. అందులోనూ, మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాకి పోటీగా దించడం విశేషం. ఇక లేటెస్టుగా సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకి యూ బై ఏ సర్టిఫికెట్ లభించింది.
ఈ సినిమాని వీక్షించిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారట. కింగ్ నాగ్ నెక్స్ట్ లెవల్ పర్ఫామెన్స్‌గా ఈ సినిమాలో నాగార్జున నటనను అభివర్ణిస్తున్నారట. నో డౌట్ మరో పదేళ్లు నాగార్జున హీరోగా కొనసాగొచ్చు.. అంటూ కితాబిచ్చేస్తున్నారట.
కొన్ని కొన్ని సీన్లు ప్రేక్షకుల్లో గూస్ బంప్స్ క్రియేట్ చేస్తాయని చెప్పారట. చాలా గ్రిప్పింగ్ స్ర్కీన్‌ప్లే అని డైరెక్టర్‌కీ ప్రశంసలు దక్కుతున్నాయట. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
‘బంగార్రాజు’తో ఓ మోస్తరు సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్న నాగార్జున, ‘ది ఘోస్ట్’గా రికార్డులు సృష్టిస్తాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా