బుర్జ్ ఖలీఫా పై వెలిగిన షారూఖ్ ఖాన్
- September 29, 2022
యూఏఈ: ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై తన పుట్టినరోజుకు ఒక నెల ముందే భారతీయ నటుడు షారూఖ్ ఖాన్ సందడి చేశారు. UAEలోని అతిపెద్ద హెల్త్‌కేర్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన బుర్జీల్ హోల్డింగ్స్ ఇంటిగ్రేటెడ్ బ్రాండ్ తరఫున రూపొందించి ప్రచార వీడియోను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన స్క్రీన్‌పై రాత్రి 8.20 గంటలకు క్యాంపెయిన్ వీడియో ప్రదర్శించారు. ఇందులో నటుడు షారుఖ్ హెల్త్‌కేర్ గ్రూప్ కథను వివరించాడు. బుర్జీల్ హోల్డింగ్స్ ఛైర్మన్ డాక్టర్ షంషీర్ వాయలీల్ మాట్లాడుతూ.. తామే గౌరవించే విలువలను ప్రతిబింబించే ప్రచారాన్ని సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌తో ప్రారంభించడం మాకు గర్వంగా ఉందన్నారు. షారుఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్న బుర్జీల్ హోల్డింగ్స్ గ్రూప్.. యూఏఈ, ఒమన్‌లో బుర్జీల్, మీడియర్, LLH, లైఫ్‌కేర్, తాజ్మీల్ బ్రాండ్ల క్రింద 39 హాస్పిటల్స్, మెడికల్ సెంటర్లను కలిగి ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







